calender_icon.png 30 January, 2026 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

04-10-2024 12:28:52 AM

మహాశక్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు

హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, అక్టోబరు 3 (విజయక్రాంతి): కరీంనగర్ మహాశక్తి అమ్మ వారి ఆలయంలో గురువారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేలాదిమంది భక్తులు 9 రోజులపాటు భవానీదీక్ష చేపట్టేందుకు ఆలయానికి తరలివచ్చారు. తొలిరోజు బాలాత్రిపుర సుందరి అవతరాంలో ముగ్గురు అమ్మవార్లు భక్తులకు దర్శనిమిచ్చారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి ఆలయంలోనే ఉన్నారు. భవానీ భక్తులతో కలి సి బాలా త్రిపుర సుందరి అవతార రూపంలో దర్శినమిస్తున్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు భక్తులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.