రాజన్న ఆలయ అభివృద్ధికి భక్తుల విరాళాలు
31-08-2026 | 12:00am
వేములవాడ, ఆగస్ట్ 30, (విజయ క్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మం డలానికి చెందిన గుండ శ్రీనివాస్ రూ.25, 116, కొండగట్టుకు చెందిన నడిగొట్టు శకుంతలలక్ష్మణ్ దంపతులు రూ.10,116 విరాళా లను ఆలయానికి సమర్పించారు.ఈ విరాళాలను ఆలయ ప్రోటోకాల్ కార్యాలయంలో (పీఆర్వో) పెరిక శ్రీనివాస్కు దాతలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ దిలీప్తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నా రు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.






