31 August, 2026 | 1:35 AM

నాగేపల్లిలో నూతన ఆలయాన్ని పర్యవేక్షించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

31-08-2026 12:00 AM

రామగిరి,ఆగస్టు30(విజయ క్రాంతి)రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, నూతన ఆలయాన్ని పర్యవేక్షించారు దీనిలో భాగంగా తాజా మాజీ సర్పంచ్ ఓదేలు యాదవ్, ఆరున్నర సంవత్సరాల నుండి నా గ్రామాన్ని చల్లగా కాపాడు తండ్రి అని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ దీక్ష కొనసాగిస్తున్నాడు

2262 రోజుల నుండి  పాదాలకు పాదరక్షలు లేకుండా దీక్షగా కొనసాగించినందుకు  మాజీ సర్పంచిని, కొండ వేన ఓదెలు యాదవ్ ని అభినందించినారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,మీ గ్రామానికి మీ శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయానికి  ఫండు కేటాయించి మీకు అండగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ గ్రామ సర్పంచ్ కొండవేన దివ్య సుధాకర్ యాదవ్ జిల్లా ఉప అధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి బీసీ సెల్ బండారి సదానందం గ్రామ శాఖ అధ్యక్షులు తీగల సది మరియు ఇతర గ్రామ సర్పంచులు యూత్ నాయకులు కొండ వేనప్రభాకర్ యాదవ్   మట్ట రాజ్ తాటి శ్రీనివాస్  ఉప సర్పంచ్ యాసం సతీష్ వార్డు సభ్యులు గోపాలకృష్ణ లక్కపురం శ్రీనివాస్ అయ్యగారు సముద్రాల శ్రీనివాస్ చార్యులు హర్షవర్ధన్ మరియు ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.