జిల్లాలో నీట్ పీజీ పరీక్ష ప్రశాంతం
31-08-2026 12:00 AM
- పరీక్ష రాసిన 1471 మంది 34 మంది గైర్హాజరు
- పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్,ఆగస్టు30(విజయక్రాంతి): జి ల్లాలో నిర్వహించిన నీట్ పి జి2026 పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.పరీక్ష నిర్వహణను ఆదివారం క లెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సంయుక్తంగా పర్యవేక్షించారు. . పరీ క్షా కేంద్రాల పరిసరాల్లో ప్రశాంత వాతావర ణం నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయం తో పనిచేశాయి.జిల్లాలోని మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో 1505 మంది అభ్యర్థులకు గాను 1471 మంది హాజరుకాగా, 34 మంది గైర్హాజరయ్యారు.






