బోరంచకు పోటెత్తిన భక్తులు
24-05-2024 01:56 AM
నారాయణఖేడ్, మే 23 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని మనూరు మండలంలో ప్రసిద్ధి చెందిన బోరంచ నల్లపోచమ్మ ఏడు వారాల జాతర ఉత్సవాల్లో భాగంగా గురువారం రెండోవారం కావడంతో వివిధ ప్రాం తాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కర్నాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాగా మనూరు ఎస్సై అంబ్రనాయక్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.






