రైతులకు జనుము విత్తనాల పంపిణీ
24-05-2024 01:57 AM
ఝరాసంగం, మే 23: రైతులుకు సహా యం చేసేందుకు వీలుగా ప్రభుత్వం జను ము విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు మండ ల వ్యవసాయ అధికారి వెంకటేశం తెలిపా రు. గురువారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవ కేంద్రంలో రైతుల పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డును జిరాక్స్ తీసుకొని విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. మండలానికి 100 క్వింటాళ్ల విత్తనాలు వచ్చినట్లు తెలిపారు.






