ఘనంగా అన్నమాచార్యుల జయంతి
24-05-2024 01:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (విజయక్రాంతి) : తెలుగు పదం ఉన్నంత కాలం తాళ్లపాక అన్నమయ్య పేరు వినిపిస్తూనే ఉం టుందని దైవజ్ఞశర్మ అన్నారు. గురువారం తెలంగాణ సాహిత్య అకాడమీ, హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య అకాడమీ కార్యాలయంలో ఘనంగా పద కవితా పితామహుడు అన్నమాచార్యుల 616వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహి త్య అకాడమీ కార్యదర్శి బాలాచారి మాట్లాడుతూ తెలుగు పదానికి స్ఫూర్తి శిఖరంగా అన్నమయ్య నిలిచారని, దాదాపు 32వేల సంకీర్తనలు రాశారని గుర్తు చేశారు.






