27 March, 2026 | 2:52 AM

పాదయాత్రతో శ్రీ శబరిమాత ఆశ్రమానికి చేరుకున్న భక్తులు

27-03-2026 01:04 AM

తాడ్వాయి, మార్చి, 26( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామానికి చెందిన శ్రీ శబరిమాత భక్తులు గురువారం పాదయాత్రతో శ్రీ శబరిమాత ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. తాము శ్రీ శబరిమాతకు ఎంతో ప్రీతిపాత్రమైన భక్తులమని తెలిపారు. అమ్మవారిని దర్శించుకుంటే అనుకున్నవి నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శబరిమాత,భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.