calender_icon.png 30 August, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి

25-10-2024 01:20:26 AM

కాళేశ్వరం సమీక్షలో కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్, అక్టోబర్ 24: కాళేశ్వరం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చూడాలని కలెక్టర్ రా హుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ఆలయంపై గురువారం సమీక్షిం చారు. వచ్చే సంవత్సరం రానున్న సరస్వతి పుష్కరాలు, భక్తుల సౌకర్యాల గురించి గత నెలలో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ సమీక్షించి, పనులను గుర్తించారని చెప్పారు. ఆ పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్యం, విద్యుత్, మౌలిక సౌకర్యాల కల్పనపై దిశానిర్దేశం చేశారు.