calender_icon.png 19 January, 2026 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు బోల్తా, 60 మంది సేఫ్

19-01-2026 01:56:08 PM

అమరావతి: విజయనగరం జిల్లాలోని అప్పన్నవలస వద్ద వారు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా(RTC Bus Overturns) పడటంతో అందులో ఉన్న 60 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో ఈ సంఘటన జరిగింది. బస్సు రాజం నుండి విజయనగరం వైపు వెళ్తుండగా, డ్రైవర్‌కు మూర్ఛ వచ్చి స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా, బస్సు బోల్తా పడి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారి కేకలు విని గ్రామస్తులు ప్రయాణికులను రక్షించడానికి పరుగెత్తుకొచ్చి, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.