calender_icon.png 19 January, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దావోస్ ట్రిప్ దండగ

19-01-2026 02:08:21 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై(CM Revanth Reddy Davos visitతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యాలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కే విమానం.. దిగే విమానం .. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి? అని ప్రశ్నించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేసుకున్నదన్నారు.

మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారని తెలిపారు. దావోస్ సమ్మిట్ లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో చేసుకున్న ఎంవోయూలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి?.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.