16-02-2026 12:00:00 AM
శంభో శంకర అంటూ
శివ నామస్మరణతో మారుమోగిన శివాలయాలు
జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల సందడి
భక్తుల ఉపవాస దీక్షలు
ఆలయాలకు పోటెత్తనున్న భక్తులు
కామారెడ్డి, ఫిబ్రవరి 1౫ (విజయక్రాంతి): హర హర మహాదేవ అంటు శివ భక్తులు శివనామ స్మరణ తో శివాలయాలను దర్శించుకున్నారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివ నామస్మరణతో భక్తులు శివునికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల ఆవరణలో సామూహిక హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఉపవాస దీక్ష లు చేపట్టిన భక్తులు కుటుంబ సమేతంగా శివాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా శివాలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం నుంచి భక్తులు శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు.
జిల్లాలోని ప్రముఖ శివాల యాలు భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం, వేములవాడ రాజరాజేశ్వరాలయం, సంతాయిపేట భీమేశ్వరాలయం, దోమకొండ లోని సీతారామ లింగేశ్వర ఆలయం, పోసానిపేట్, రామేశ్వర్ పల్లి, కృష్ణాజి వాడి గ్రామాలలో రాజరాజేశ్వరాలయాలు, మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర ఆలయం, బీర్కూరు రామలింగేశ్వర ఆలయం, ఆత్మకూర్, త్రి లింగేశ్వర ఆలయం, కామారెడ్డి లోని శివాలయం, వడ్లూరు ఎల్లారెడ్డి లోని వీరభద్ర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవా లు ఘనంగా నిర్వహించారు.
భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. భజనలు చేశారు. శివ భక్తి గీతాలతో అలరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. ఆయా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యనాథీశ్వర ఆలయంలో రుద్ర హోమం, శివ మాలాధారణ ధరించిన శివ భక్తులు శివాలయాలలో రాత్రి జాగరణ కార్యక్రమాలు చేపట్టారు. అడ్లూరు ఎల్లారెడ్డి లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమం నిర్వహిం చారు. భక్తులు తండోపతండాలుగా శివాలయం దర్శించుకున్నారు. హరి ఓం శివ అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ తరించారు.
పండ్ల వ్యాపారుల డిమాండ్
ఉపవాస దీక్షలను విరమించేందుకు భక్తులు వివిధ రకాల పండ్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన భక్తులకు పండ్ల వ్యాపారము ధరలను పెంచి సొమ్ము చేసుకున్నారు. మహాశివరాత్రి కావడంతో భక్తులు కాదనలేక డబ్బు ఎక్కువైన పెట్టి పండ్లను కొనుగోలు చేసుకుని వెళ్లారు.