calender_icon.png 16 February, 2026 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీరంగూడ గుట్టకు పోటెత్తిన భక్తజనం

16-02-2026 12:34:46 AM

శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు

సాఫీగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

అమీన్ పూర్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి, ఆదివారం కావడంతో బీరంగూ డలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ పోటెత్తింది. దీంతో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. సైబరాబాద్ అమీన్పూర్, ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ట్రాఫిక్ ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి వన్ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా పార్కింగ్ స్థలాలను పెంచడంతో పాటు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించామన్నారు.

డ్రోన్లతో నిఘా.. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

పర్వదినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీని నియంత్రించేందుకు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేశారన్నారు. 50 సీసీ కెమెరాల ద్వారా క్యూలైన్ల పరిస్థితిని, డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.ఎక్కడా వాహనాలు నిలిచిపో కుండా ప్రత్యేక బలగాలను మోహరించారన్నారు.సజావుగా దర్శనాలు రోటేషన్ పద్ధతి లో క్యూలైన్లను క్లియర్ చేస్తూ భక్తులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ముందస్తు ప్రణాళికతో ట్రాఫి క్ సమస్య తలెత్తకపోవడంతో భక్తులు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయంతోనే ఈ ప్రక్రియ విజయవంత మైందని పేర్కొన్నారు.