25-05-2025 09:32:06 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం(Sri Seetha Ramachandra Swamy Temple) సన్నిధిలో ఆదివారం హైదరాబాదుకు చెందిన ఆవుల శ్రీ లాస్య ఆలపించిన కర్ణాటక సంగీత భక్తి గీతాలాపన భక్తులను అలరించింది. డా. అశ్విన్, రాయప్రోలు సుబ్రహ్మణ్య శర్మ, కే జగన్మోహిని తదితరులు సంగీత సహకారం అందజేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిపై ఆలపించిన భక్తి పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలువురు లాస్యని అభినందించారు.