15 April, 2026 | 11:05 AM

రెండు గ్రామాల్లో నులిపురుగు నిర్మూలన నివారణ కార్యక్రమం

07-01-2026 12:00 AM

నాగిరెడ్డిపేట, జనవరి 6 (విజయ క్రాంతి): మండలంలోని తాండూర్, అక్కంపల్లి గ్రామాలలో మంగళవారం మండల వైద్యాధికారి  రవికుమార్ గొర్రె మేకలకు నులి పురుగు నివారణ మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ వైద్యాధికారి  రవికుమార్ మాట్లాడుతూ... గొర్రె మేకల యజమానులు తప్పనిసరి నులిపురుగు నిర్మూలన మందులను వేయించాలని సూచించారు. రెండు గ్రామాలలో 825 గొర్రెలకు, 568 మేకలకు నులిపురుగు నిర్మూలన మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సర్పంచ్ యాదవ్ గౌడ్, అక్కంపల్లి సర్పంచ్ వెంక గౌడ్,పశు వైద్య సిబ్బంది గౌస్తో పాటు గొర్రె మేకల యజమానులు తదితరులు పాల్గొన్నారు.