15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

07-01-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, జనవరి 6 (విజయక్రాంతి): మధ్యాహ్నం భోజనం వికటించి ఎనిమిది మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో గల బాలుర ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన ఎనిమిది మంది విద్యార్థులు కడుపునొప్పిగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి తులసికి చెప్పారు.

ఆమె వెంటనే స్థానికుల సహాయంతో విద్యార్థులను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం నమోనాలను ప్రయోగశాలకు పంపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు.