calender_icon.png 10 January, 2026 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య

07-01-2026 12:00:00 AM

రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కిరాతకంగా హత్యకు పాల్పడ్డ హంతకులు           

నిజామాబాద్ జనవరి 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాంలో జరిగిన పల్లటి రమేష్ దారుణ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.     అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య సౌమ్య తన ప్రియుడితో కలిసి భర్త రమేష్ దారుణ హత్య కు పడినట్టు పోలీసుల బయటపడింది. తన వివాహేతర సంబంధంతో పాటు రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును కాజేయాల ని భార్య, ఆమె ప్రియుడు కలసి పథకం ప్రకారం కుట్రపల్లి ఈ దురాగతానికి ఒడిగట్టినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  భర్త మరణంతో వచ్చే బీమా డబ్బుతో పారిపోవాలని నిందితులు ఇద్దరూ పక్కా ప్లాన్ తో పకడ్బందీగా హత్యకు పాల్పడ్డారు. మొదట తన భర్త గుండెపోటు మరణించాడని సౌమ్య నాటక మాడింది.

తన ప్రకారం భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చిన సౌమ్య తన భర్త రమేష్ నిద్రలోకి జారుకున్న అనంతరం గొంతునులిమి హత్య చేసింది. తనపై అనుమానం రాకుండా సాధారణ మరణంగా దానిని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గుండెపోటుకు గురై రమేష్ మరణించినట్లు కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది.  సౌమ్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడు రమేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తన అన్నమరణం విషయ మై దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికి తీయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు కోరాడు.  తమ్ముడి ఫిర్యాదుతో.. ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.  రమేష్ అనుమానస్పద మృతిపై విచారణ ప్రారంభించారు.

రమేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వ హించారు. ఈ క్రమంలోనే రమేష్ గొంతును నులిమి చంపినట్లు పోస్టుమార్టంలో నిర్ధరణ అయ్యింది. దీంతో భార్య సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిం చగా రమేష్ భార్య సౌమ్య వాస్తవాలు వెల్లడించింది. జరిగినదంతా పూసగొచ్చినట్లు పోలీసులకు వివరించింది. ప్రియుడు దిలీప్‌తో ఉన్న అక్రమ సంబంధంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బును కాజేసేందుకు భర్తను చంపినట్లు ఆమె పోలీసుల ముందు అంగీకరించింది. దీంతో సౌమ్యతో పాటు ఆమె ప్రియుడు దిలీప్‌ను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.