24-12-2025 10:00:02 PM
చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వం అందించే నట్టల మందులను గొర్రెల పెంపకం దారులు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం కోరారు. బుధవారం చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో మూగజీవాలకు, గొర్రెలకు నట్టల మందు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం అందించే నట్టల మందులను సకాలంలో మూగ జీవాలకు గొర్రెలకు అందించి మందులను సద్వినియోగం చేసుకోవాలని పెంపకందారులను కోరారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, నీలకంఠ లింగస్వామి, ఏర్పుల వెంకన్న, గుండెపురి నరేష్ తదితరులు పాల్గొన్నారు.