24-12-2025 09:52:29 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 18 నుండి 31 వరకు నిర్వహించుచున్న లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపయిన్ లో భాగంగా ఇంటింటి కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వేను రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ సుజాత (మానిటరింగ్ అధికారి) బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అలాగే కుష్టు వ్యాధిపై జరుగుతున్న ఇంటి ఇంటి సర్వే ను ఐతరాజు పల్లి గ్రామంలో పరిశీలించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు అందరూ భాగస్వాములై కుష్టు రహిత సమాజాన్ని నిర్మించాలని వారు కోరారు. భారతదేశము నుండి ఈ కుష్టు వ్యాధిని 31, మార్చ్ 2027 సంవత్సరం వరకు తరిమికొట్టాలని సంకల్పంతో మనం అందరం చేయ వలసిన అవసరం వుంది అని వారు తెలియ జేశారు. ఎవరికైనా శరీరం పైన మొద్దు బారిన మచ్చలు ఉన్నట్లు అనిపిస్తే ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటి ఇంటికి వచ్చినప్పుడు వారికి చూపించు కోవాల్సిందిగా తెలియజేశారు.
అట్లాగే ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కు చూపించు కొని ఉచితంగా మందులు తీసుకోవాల్సిందిగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ మరియు ప్రోగ్రాం అధికారి( లెప్రసి) డాక్టర్ సుధాకర్ రెడ్డి, ఇతర ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ కిరణ్ కుమార్ మరియు పి.హెచ్.సి గర్రెపల్లి వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్, డీపీఎంఓలు బి .దేవి సింగ్, కె .రమేష్ గారు మరియు ఐతరాజపల్లి ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ సంతోష్ కుమార్ , వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.