calender_icon.png 24 December, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ గణిత సదస్సులో కుకునూరుపల్లి ఉపాధ్యాయుడు

24-12-2025 10:02:35 PM

కొండపాక,(విజయక్రాంతి): జాతీయ విద్యా  పరిశోధన  శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అజ్మీర్ రాజస్థాన్ రీజనల్ ఇన్స్ ట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 14వ జాతీయ గణిత సదస్సులో కుకునూరు పల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు విరుపాక అజయ్ రెడ్డి పాల్గొన్నట్టు ఎంఈఓ బచ్చలి సత్తయ్య తెలిపాడు. ఈ సదస్సు ఈనెల 22 నుంచి 24 వరకు అజ్మీర్ లో జరిగింది. గణిత సదస్సులో అజయ్ రెడ్డి గణిత విద్యలో ఉద్భవిస్తున్న ధోరణులు అనే అంశంపై వివరించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గణిత సదస్సులో పాల్గొన్న అజయ్ రెడ్డిని ఎంఈఓ సత్తయ్య ఉపాధ్యాయ బృందం అభినందించారు.