24-12-2025 09:57:06 PM
గరిడేపల్లి ఎస్ఐ ని సన్మానించిన యూత్ సభ్యులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలుపరచిన గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ ను మండలంలోని యూత్ సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. జై భీమ్ అధ్యక్షులు కొత్తపల్లి రవి, కుర్రి వెంకన్న మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా రాత్రి పగలు నిద్రాహారాలు మాని గ్రామ గ్రామాన గస్తికాస్తు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలుపరచి ఎలక్షన్ సజావుగా నడిపించినందుకు ఆయనను ఘనంగా సన్మానించినట్లు వారు తెలిపారు. సన్మానించిన వారిలో దూరే వినోద్, కడప వీరస్వామి, నకిరేకంటి రవి, కొత్తపల్లి మైసయ్య, పిట్ట వెంకటేష్, మచ్చ ఆదాం, మధు, నాగార్జున, పవన్, వేణు, రాజేష్, గౌతమ్, పండు యూత్ సభ్యులు పాల్గొన్నారు