24-12-2025 09:34:06 PM
ముకరంపుర,(విజయక్రాంతి): ఈనెల 27 నుంచి 29 వరకు హైదరాబాదు గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కంకణాల స్వరణ్ అర్హత సాధించారు. అదేవిదంగా వాటర్ పోలో జట్టుకు భువన్ ఎంపికయాడు. ఈ సందర్భంగా స్వరణ్, భువన్ ను ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, డి వై ఎస్ ఓ శ్రీనివాస్ గౌడ్, కోచ్ లు చంద్రశేఖర్, సంపత్, శ్రీకాంత్ అభినందించారు.