calender_icon.png 24 December, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిరేకల్ లో క్రైస్తవులకు ప్రేమ విందు

24-12-2025 10:05:46 PM

నకిరేకల్,(విజయక్రాంతి): మానవాళి రక్షణకు  యేసుక్రీస్తు ప్రభవించాడని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. బుధవారం స్థానిక లక్ష్మీనారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గస్థాయి క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ప్రేమ విందు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిసిసి అధ్యక్షులు పున్న కైలాస్ నేత, డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ళ వెంకటరెడ్డి, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, మునిసిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, అధికారులు, నాయకులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.