27 July, 2026 | 2:56 AM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చారిత్రాత్మక విజయం

27-07-2026 02:18 AM

పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ 

హైదరాబాద్, జూలై 26(విజయక్రాంతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమానికి చారిత్రాత్మక విజయమని పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గుండ్లపల్లి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం విద్యార్థులు చేసిన సత్యాగ్రహానికి ఇది తొలి మహత్తర విజయమన్నారు.

ఈ ఉద్యమంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలిచారని తెలిపారు. శాంతియుత నిరసనల సందర్భంగా నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లాఠీచార్జికు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రధానమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సత్యనారాయణ గుండ్లపల్లి పిలుపునిచ్చారు.