సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం
కొత్తగూడెం,(విజయక్రాంతి): కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేసి, JBCCI–12వ వేతన ఒప్పంద చర్చలను వెంటనే ప్రారంభించాలని జిఎం (వెల్ఫేర్) కు మెమొరండం సమర్పించిన జాతీయ సంఘాల నాయకులు ఐఎన్టియుసి జాతీయ నాయకులు డా. శ్రీ సంజీవరెడ్డి నాయకత్వంలో సెక్రటరీ జనరల్ డా. శ్రీ బి.జనక్ ప్రసాద్ ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని మైన్స్, ఓపెన్ కాస్ట్, డిపార్ట్మెంట్స్ లలోని నాయకులు కార్యకర్తలు, ఉద్యోగులు, ప్రధాన కార్యాలయం ముందు భారీ ఎత్తున జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ముఖ్యంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని,అలాగే జేబీసీసీఐ –12వ వేతన ఒప్పంద చర్చలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో INTUC, AITUC, CITU, HMS సంఘాలు భారీ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో నాలుగు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేశారు. అనంతరం సంఘాల ప్రతినిధులు సింగరేణి జీఎం (వెల్ఫేర్) శ్రీ కిరణ్ కుమార్ కు తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ డా. శ్రీ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి కార్మికుల ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న జేబీసీసీఐ –12వ వేతన ఒప్పంద చర్చలను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, న్యాయమైన వేతన సవరణను అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యొక్క మహా ధర్నాలో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు డిఎల్ఆర్ కార్మికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు,12 ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు, సెంట్రల్ నాయకులు, బ్రాంచ్ నాయకులు, అన్ని ఏరియాలో ఫిట్ కార్యదర్శులు, ట్రెజరర్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఏరియా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, డిఎల్ఆర్ కార్మికులు, మహిళా ఉద్యోగులు, మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.






