1 July, 2026 | 6:49 PM

Breaking News

కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •  

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం

01-07-2026 06:07 PM

వైద్య సేవలకు గుర్తింపుగా లోతువాగు సర్పంచ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

కొత్తగూడెం లక్ష్మిదేవిపల్లి,(విజయక్రాంతి): జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలోని గిరిప్రసాద్ నగర్, జయశంకర్ కాలనీలలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆశిష్ జకోటియా ఆధ్వర్యంలో, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య శిబిరం అనంతరం గ్రామ ప్రజలకు నిస్వార్థంగా ఉచిత వైద్య సేవలు అందించినందుకు గుర్తింపుగా, జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా లోతువాగు సర్పంచ్ ఈసం కళ్యాణి ఆధ్వర్యంలో డాక్టర్ ఆశిష్ జకోటియాను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు డాక్టర్ అందించిన సేవలను కొనియాడుతూ, కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం, అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.