calender_icon.png 21 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధురంధర్ సీక్వెల్ భావోద్వేగభరితం

21-01-2026 12:37:16 AM

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ తెరకెక్కించిన చిత్రం ‘ధురంధర్’. ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర తిరగరాసిన ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమాలో ‘యాలినా’ పాత్రలో అందరి మనసు దోచేసింది సారా అర్జున్. ‘ధురంధర్’ తర్వాత సారాకు టాలీవుడ్‌లో క్రేజీ అమాంతం పెరిగి పోయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా ‘ధురంధర్’ సీక్వెల్ గురించి చెప్పిన సంగతులివీ.. “ధురంధర్’ పార్ట్-1 కన్నా పార్ట్-2 అంతకు మించి యాక్షన్, అదిరిపోయే కథ ఉండబోతున్నాయి. తొలిభాగంలో యాలినా కేవలం ప్రేమలో పడే అమ్మాయిగా కనిపించింది.. రెండోభాగంలో ఆమెలోని అసలైన బలాన్ని ప్రేక్షకులు చూస్తారు. సీక్వెల్‌లో నేనను కేవలం ఒక గ్లామర్ పాత్రగా కాకుండా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపిస్తా.

ఒక ప్రకాశవంతమైన అమ్మాయి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించే మహిళగా తన పాత్ర ప్రయాణం చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది” అని తెలిపింది. ఇక సారా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ గుణశేఖర్ ‘యుఫోరియా’ చిత్రం లో నటిస్తోంది.  నేటి యూత్‌కు, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది.  ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది.