calender_icon.png 21 January, 2026 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది సరైన పద్ధతి కాదు!

21-01-2026 12:38:35 AM

‘రాజాసాబ్’ చిత్రంలో ప్రభాస్‌తో ఆడిపాడింది అందాల నిధి.. నిధి అగర్వాల్. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై, మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. ఇదిలావుండగా తాజాగా నిధి అగర్వాల్ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై జరుగుతున్న నెగెటివ్ పీఆర్, పెయిడ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది.

ప్రతిభను ప్రోత్సహించడం మాని, ఒకరిని కిందకు లాగడానికి ప్రయత్నించడం సరైనది కాదని అభిప్రాయపడింది. “ఒకరిని పైకి తీసుకురావడం కంటే.. డబ్బు ఖర్చు చేసి మరీ ఎదుటివారిని తొక్కేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. బుక్ మై షో రేటింగ్స్, ఐఎంబీ రివ్యూలను కూడా డబ్బుతో ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల నాపై కూడా ఒకటి రెండు నెగెటివ్ క్యాంపెయిన్లు మొదలయ్యాయి.

అయితే, నేను వాటిని వెంటనే అడ్డుకున్నాను. నేను నా పనినే నమ్ముకుంటా. స్వశక్తి మాత్రమే మనల్ని పైకి తీసుకొస్తుందని నమ్మే తత్వం నాది. కానీ నన్ను కావాలని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోను. నటీనటులు చాలా సున్నిత మనస్కులు. ఇలాంటి దాడులు వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇటీవల వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ వంటి నటులపై నెగెటివ్ పీఆర్ దాడులు చాలా మంది జీవితాల్లో ప్రభావం చూపాయి. ఇలాంటివి చేయడం సరైన పద్ధతి కాదు. సెలబ్రిటీలు అంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు, వారికి కూడా ఇంట్లో తల్లిదండ్రులుంటారు. వారికి మేము సమాధానం చెప్పుకోవాలి” అని తెలిపింది.