10 April, 2026 | 1:51 AM

రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి.. మెరుగైన వైద్యం అందించాలి

10-04-2026 12:30 AM

కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 9(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక లో భాగంగా 99 రోజుల కార్యాచరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆ ద్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఎయి డ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ గరి మ అగ్రవాల్ హాజరయ్యారు. ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.