calender_icon.png 23 May, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమం.. భక్తులు సంప్రదించాల్సిన నంబర్ ఇదే...

23-05-2025 08:57:36 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) శుక్రవారం నాడు ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు(Tirumala Darshan Tickets) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

డయల్ యువర్ ఈవో

టీటీడీ రేపు డయల్ యువర్ ఈవో(Dial Your EO programme) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. స్థానిక అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఈవో కార్యక్రమం కొనసాగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. భక్తులు సంప్రదించాల్సి ఫోన్ నంబర్ : 0877-2263261.