23-05-2025 09:10:47 AM
హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో కలకలం రేపిన బాబు కిడ్నాప్(Kidnapping Case) కేసులో తల్లినే నిందితురాలిగా గుర్తించారు. ఈ నెల 17న దుబ్బాక మండలం అప్పనపల్లిలో 2 నెలల బాబు అపహరణకు గురయ్యాడు. ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి బాబును అపహరించారని తల్లి తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు తల్లి అంగీకరించింది. అదే రోజు అప్పనపల్లి శివారు బావిలో బాబును పడేసినట్లు తల్లి తెలిపింది. బావిలో నుంచి బాబు మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. అనంతరం నిందితురాలిని సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్(Siddipet Women's Police Station) కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.