calender_icon.png 15 July, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి కృషి: డీఎం విశ్వనాథ్

14-11-2024 03:33:23 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసి బస్సులలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే  ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవడమే తమ లక్ష్యమని ఆసిఫాబాద్ డిపో మేనేజర్‌ విశ్వనాథ్ అన్నారు. గురువారం డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సమస్యల పరిష్కరించేందుకుగాను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్‌ యువర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. ప్రయాణికులు ఆసిఫాబాద్ డిపో బస్సులకు సంబందించిన తమ సమస్యలు, సలహాలు సమాచారం సెల్‌ నెంబర్: 9959226006 గల నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకొనగలరని డిఎం సూచించారు.