‘ఈడబ్ల్యూఎస్’కు మేము అడ్డుపడ్డామా!
-బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఎందుకంత కుట్ర
-పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ భావోద్వేగం
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సీనియ ర్ నేత వి.హనుమంతరావు భావోద్వేగానికి గురయ్యారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ కోసం 10 శాతం రిజర్వేషన్లు పెడితే మేము అడ్డుపడ్డామా..? అని ప్రశ్నించారు. తాము ఒక్క కోర్టుకు సైతం పోలేదని, ఎందుకంటే అందులో కూడా పేదవారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి అగ్రకులా నికి చెందిన వారైనా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నారని తెలిపారు. బీసీలకు ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్లు రాక పోతే జీవితంలో ఇంకెప్పుడూ రావని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఓబీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ ఓ అడుగు ముం దుకు వేయాలని వీహెచ్ కోరారు. రాజ్యంగంలోని షెడ్యూల్ 9లో చేర్చి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.




