calender_icon.png 8 July, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు తెలుసా?

06-07-2025 12:00:00 AM

* రూబిక్స్ క్యూబ్‌ను తయారుచేసిన ఎర్నో రూబిక్‌కు ఆ క్యూబ్‌ను పరిష్కరించడానికి నెల సమయం పట్టింది. 

* మీకు కలలో కనిపించేవారంతా, నిజ జీవితంలో మీరు చూసినవారే అయ్యుంటారు.  

* ఏకాలంలో ఎక్కువమంది ఆటగాళ్లు ఆడిన ఆటగా పబ్‌జి గేమ్ రికార్డుకెక్కింది. ఈ ఆటను ఒకేసారి 13,42,857 మంది ఆడారు.

* 1950 వరకు సిగరెట్లను ఆరోగ్యానికి మంచివని చెబుతూ ప్రమోట్ చేశారు.

* జపాన్‌లో బరువు భారీగా పెరగడం చట్టవిరుద్ధం. 

* ఇది ఖరీదైన నీళ్ల సీసా. ఖరీదు అరవై వేల డాలర్లు. ఈ నీళ్లలో అయిదు మిల్లీగ్రాముల బంగారు పొడిని కలుపుతారు. బంగారు తాపడం చేసిన సీసాలో ఇస్తారు. 

* ఈ పాండా పేరు కిజాయ్. ప్రపంచంలోని ఏకైక బ్రౌన్ రంగులో ఉన్న పాండా.

* షార్క్ చేపల గుడ్లు పారదర్శకంగా ఉంటాయి.

* ఎండ్రాకాయల పొట్టలో దంతాలు ఉంటాయి. అక్కడే ఆహారాన్ని నములుతాయి.

* చిరుత పులులు గర్జించవు. పిల్లులాగే మ్యావ్ మ్యావ్‌మంటాయి.