calender_icon.png 8 July, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామయ్య తెలివి

06-07-2025 12:00:00 AM

ఒక రోజు తెనాలి రామలింగడు అడవి మార్గంలో వెళ్తున్నాడు. ఇంతలో వర్తకుడు కంగారుగా వచ్చాడు. మీరు ఏదైనా ఒక గుర్రాన్ని చూశారా? అని రామలింగడుని అడిగాడు. ‘మీ గుర్రం ఒక కాలుకి దెబ్బతగిలిందా? ‘నీ గుర్రానికి ఒక కన్ను కనిపించదా? గుర్రంపై ఒక వైపు బెల్లం మరో వైపు బియ్యం వేసుకెవెళ్తున్నావా? అని రామలింగడు ఆ వర్తకుడిని ఎదురు ప్రశ్నించాడు. అప్పుడు ఆ వర్తకుడు ‘స్వామి..

మీరు నా గుర్రాన్ని చూసి ఉంటారు. అందుకే కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. నా గుర్రం ఎటువైపు వెళ్లిందో చెప్పండి’ అని ప్రార్థించాడు. అప్పుడు రామలింగడు ‘నేను నీ గుర్రాన్ని చూడలేదు. కానీ నేను వస్తున్న దారిలో గుర్రం మూడు పాదాల ముద్రాలు కనిపించాయి. మరో కాలు ఈడుస్తున్నట్లు ఉంది. అంతే కాకుండా దారికి ఇరువైపులా గడ్డి ఉంటే.. గుర్రం ఒక వైపు మాత్రమే ఉంది.

అందువల్ల గుర్రానికి ఒక కన్ను ఉన్నట్లు గమనించా. దీనితో పాటు దారిలో ఒకవైపు చీమలు బెల్లపు రజనును మోసుకుపోతున్నాయి. మరోవైపు కొన్ని బియ్యం పడి ఉన్నాయి. వీటి ఆధారంగా నీ గుర్రం అడవిలోకి వెళ్లిందని చెప్పగలిగా’ అన్నాడు. వెంటనే ఆ వర్తకుడు అడవిలోకి వెళ్లి గుర్రాన్ని తిరిగి తెచ్చుకున్నాడు.