06-07-2025 12:00:00 AM
పిల్లలకు ఆరో తరగతి తర్వాత నిద్ర కరువవుతోంది. కొన్ని స్కూళ్లు, కాలేజీలూ ఉదయం ఏడుగంటలకే మొదలైపోవడం, రాత్రుళ్లు కూడా ఏదో ఒక హోంవర్క్ ఉండటంతో ఎనిమిది గంటలసేపైనా వాళ్లకి నిద్ర ఉండట్లేదు. అలాంటప్పుడు శని, ఆదివారాల్లో పిల్లలు కాస్త ఎక్కవ సేపు నిద్రపోవాలన్నా.. కొందరు తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇదే అలవాటైతే వీక్ డైస్‌లో ఇబ్బందవుతుంది అని చెబుతుంటారు.
కానీ వాళ్లని సెలవు రోజుల్లో గంటారెండు గంటలు అదనంగా హాయిగా నిద్రపోనివ్వండి అంటున్నారు అమెరికాలోని ఓరెగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. 13 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు రెండువేల మంది విద్యార్థుల నిద్ర అలవాట్లూ, అవి వాళ్ల మానసిక ఆరోగ్యంపైన చూపుతున్న ప్రభావంపైన ఈ పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు.
వీక్ డేస్‌లో ఎనిమిదిగంటలకన్నా తక్కువ సమయం నిద్రపోతున్నవాళ్లు.. వారాంతాల్లో గంటారెండు గంటలు అదనంగా కునుకుతీయడం మంచిదేనని చెబుతున్నారు. ఆ అదనపు నిద్రవాళ్లలో జ్ఞాపకశక్తిని పెంచి, ఆ వయసులో ఎక్కువగా కనిపించే ఉద్వేగాల తీవ్రతని నియంత్రిస్తుందట.