17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మహారాష్ట్ర మహాయుతి కూటమిలో విభేదాలు

26-06-2025 11:46 PM

శివసేన, ఎన్సీపీ మంత్రులపై సీఎం ఫడ్నవీస్ ఆగ్రహం..

ముంబై: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కొందరు మంత్రులు తమ పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్డీలను అనధికారికంగా కొనసాగించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(CM Devendra Fadnavis) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు సిబ్బంది వాటిని బేఖాతరు చేయడంతో నిబంధనలు ఉల్లఘించిన ఆరుగురు సిబ్బందికి క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం కూటమిలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది. ఇది కేవలం పర్సనల్ సెక్రటరీల సమస్య కాదని, ఇది కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం లోపం, నమ్మకం లేకపోవడాన్ని చూపిస్తుందని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివర్ తెలిపారు.