11 August, 2026 | 1:39 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

లౌకిక, సోషలిస్ట్ పదాలు తొలగించండి

27-06-2025 12:25 AM

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ 

న్యూఢిల్లీ, జూన్ 26: రాజ్యంగ ప్రవేశిక నుంచి లౌకిక,సోషలిస్ట్ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే గురువారం డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. 1975లో అప్రకటిత ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాం గ ప్రవేశికలో ‘లౌకిక’, ‘సోషలిస్ట్’ పదాలను చేర్చిందని, వాటిని ఉంచా లా వద్దా అనేది ఒకసారి పరిశీలించాలన్నారు.

దీనిపై చర్చించాల్సిన అవ సరముందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పౌర స్వేచ్ఛలు, ప్రతిపక్షాల నాయకులను జైళ్లలో నిర్భందించడం, పత్రికా స్వేచ్ఛను అణిచివేయడం లాంటివి చేసిన అప్పటి ఇందిరా ప్రభుత్వం ఆ పదాలను రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఉపయోగం ఏ ముందని మండిపడ్డారు. అనాటి అప్రకటిత ఎమర్జెన్సీకి కాంగ్రెస్ ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదని దత్తా త్రేయ ఎద్దేవా చేశారు.