4 లక్షల వ్యయంతో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభం
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మొగిలిపాలెం గ్రామం, తిమ్మాపూర్ మండలంలోని ఎంపీ యుపిఎస్ ఇస్లాంనగర్ పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్ ప్రారంభం మరియు పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండ వేణుమూర్తి హాజరయ్యారు. సీనియర్ సభ్యుడు ప్రకాశ్ హోల్లా, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మడేకర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ ట్రస్టీలు కోల అన్నారెడ్డి, బొమ్మ పావన్, చిదుర సురేష్, తిమ్మాపూర్ ఎంఈఓ శ్రీ వి.శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వసీమ ఉపాధ్యాయులు, ఏఏపీసి ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆధునిక విద్యను ప్రోత్సహించేందుకు కంప్యూటర్లతో కూడిన డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్ మరియు బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, పాఠశాల కార్యకలాపాల కోసం సౌండ్ సిస్టమ్‌ను అందించారు. అదనంగా ఆఫీస్ టేబుల్స్, అల్మిరాలు, ప్రింటర్, వాటర్ ప్యూరిఫైయర్, వాటర్ ఫ్రిజ్, విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా పంపిణీ ఈ కార్యక్రమంలో పంపిణీ చేసిన వస్తువుల మొత్తం విలువ 4,00,000లకు పైగా ఉండటం విశేషం.
గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో రిబ్బన్ కట్టింగ్‌తో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్య ప్రాముఖ్యతను వివరించి, లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు. ముక్క శరత్ కృష్ణ అధ్యక్షుడు మయడం శివకాంత్ కార్యదర్శి బట్టు వినోద్ ఖజాంచి తదితర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




