సర్పంచ్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు
31-03-2026 08:02 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు గ్రామపంచాయతీ సర్పంచ్ దుర్గం సరోజ పై జిల్లా కలెక్టర్, బెజ్జూర్ ఎంపీడీవోకు మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పదవ వార్డు సభ్యుడు రాకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో సర్పంచ్ హాజరుకాకుండా భర్త దుర్గం తిరుపతి, బీఆర్ఎస్ నాయకునీతో కలిసి పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు. వారిద్దరూ కలిసి గ్రామపంచాయతీలో కూర్చొని సర్పంచ్ చేయవలసిన పనులు చేస్తూ అజమాయిశి చేస్తున్నారని ఆరోపించినట్లు తెలిపారు. ఈ విషయంలో సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.




