20 June, 2026 | 3:39 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

దిలీప్ టిర్కీకి పితృ వియోగం

10-01-2025 11:47 PM

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తండ్రి విన్సెంట్ టిర్కీ కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న విన్సెంట్ శుక్రవారం మృతి చెందినట్లు దిలీప్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ విన్సెంట్ మృతి పట్ల నివాళి అర్పించారు. ‘హాకీ ఇండియా తరఫున దిలీప్ టిర్కీ తండ్రి విన్సెంట్‌కు సంతాపం ప్రకటిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని తెలిపారు. కాగా సీఆర్పీఎఫ్‌లో పనిచేసిన విన్సెంట్ ఒడిశా రాష్ట్ర హాకీ ప్లేయర్‌గా పలు మ్యాచ్‌లు ఆడారు. ఇక దిలీప్ టిర్కీ భారత్ తరఫున 412 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించారు. భారత్ తరఫున 1996 అట్లాంటా, 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సభ్యుడిగా ఉన్న దిలీప్ 2002లో భారత హాకీ జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆయన సారధ్యంలో భారత హాకీ జట్టు 2002 ఆసియా గేమ్స్, 2003 ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. 1998 ఆసియా గేమ్స్‌తో పాటు 2003 ఆసియా కప్‌లో స్వర్ణాలు గెలిచిన జట్టులో దిలీప్ టిర్కీ సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడిగా పేరు పొందిన దిలీప్ టిర్కీ 2010లో రిటైర్మెంట్ ప్రకటించారు.