మార్చిలో దిల్‌రూబా
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్‌కు రావాల్సిన ఈ సినిమా బెటర్ ఔట్ పుట్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది. మార్చి 14న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘క’ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం మంచి ఫామ్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ‘దిల్‌రూబా’పై ప్రేక్షకుల్లో అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్; సంగీతం: సామ్ సీఎస్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్.






