09-05-2025 12:20:45 AM
రాజేంద్రనగర్, మే 8: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి వియత్నాం రాజధాని హనోయ్కు నేరుగా విమాన సేవలు ప్రారంభమ య్యాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) ఈ సేవలు ప్రారంభమయ్యాయని గురువారం ప్రకటించింది.
వియత్నాం ఎయిర్లైన్స్ 7 మే 2025 నుంచి ఈ నూతన సేవలను అందిస్తున్నట్లు వివరించారు. హనోయ్లోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరే విమానం (విఎన్ -984) ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలదేరుతుంది .
ఇది హనోయ్కు స్థానిక సమయానికి పొద్దున్నే 5:25 గంటలకు చేరుకుంటుంది. తిరిగి హనోయ్ నుంచి బయలుదేరే విమానం (విఎన్-985) అక్కడి సమయానికి సాయంత్రం 7:15 గంటలకు బయలుదేరి, రాత్రి 10:15కి హైదరాబాద్ చేరుకుంటుందని వివరించారు.