09-05-2025 10:24:33 AM
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పాకిస్థాన్ పై భారత్ ప్రతిదాడులను నిశితంగా పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎన్ఎస్ఏ, సీడీఎస్ ప్రధాని మోదీకి తెలియజేస్తున్నాయి. త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) సమావేశం అయ్యారు. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా త్రివిధ దళాధిపతులతో రాజ్ నాథ్ భేటీ జరిగింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తోనూ రక్షణ మంత్రి సమావేశమయ్యారు. గత రాత్రి పాక్ జరిపిన దాడులు, సైనికులు స్పందించిన తీరుపై చర్చించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై రాజ్ నాథ్ సింగ్ చర్చించారు. దేశ భద్రతపై నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోడీతో అజిత్ దోవల్(Ajit Doval) సమావేశం కానున్నారు. యుద్ధ పరిస్థితులపై చర్చించనున్నారు. అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ దల్దీత్ చౌధురి భేటీకానున్నారు. పాక్ దాడులు, భారత ప్రతి దాడులపై మీడియా సమావేశాలు నిర్వహించున్నట్లు సమాచారం