09-05-2025 10:08:01 AM
న్యూఢిల్లీ: పాకిస్తాన్ డ్రోన్ దాడులపై భారత్ ఆర్మీ కీలక ప్రకటన(Indian Army key announcement) చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్లతో(Pakistan Drone Attacks) దాడిచేసిందని వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించిందని పేర్కొంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్న భారత ఆర్మీ(Indian Army) పాక్ కుట్రలన్నింటికీ దీటుగా జవాబిస్తామని స్పష్టం చేసింది. ఉగ్రవాద సంస్థల తరహాలో పాకిస్థాన్ సైన్యం ప్రవర్తిస్తోందని ఆరోపించింది. ఇజ్రాయెల్ పై హమాస్ తరహా దాడులను పాక్ ప్రయత్నిస్తోందని తెలిపింది.
గత నెల పీవోకేలో ఐఎస్ఐ, హమాస్(ISI, Hamas) మధ్య భేటీ జరినట్లు సమాచారం. ఉద్రిక్తతల దృష్ట్యా సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ఏర్పాటు చేశారు. భారత్ సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ దాడులకు తెగబడింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో పాక్ దాడులు చేసింది. యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో పాక్ దాడులు చేసింది. పాకిస్థాన్ దాడులను భారత రక్షణ వ్యవస్థ(Indian Defense System) సమర్థంగా తిప్పికొట్టింది. జమ్మూ విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్షంగా పాక్ దాడులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాక్ డ్రోన్లు, 3 యుద్ధ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 రెండు జేఎఫ్-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది.
అఖ్నూర్ లో ఎఫ్-16 విమానాన్ని రక్షణ వ్యవస్థ ఎస్-400 కూల్చేసింది. పాకిస్థాన్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్లను భారత్ ఆర్టీ కూల్చివేసింది. పాక్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైన్యం కూల్చివేసింది. పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 పైలట్ ను భారత్ సైన్యం అదుపులోకి తీసుకుంది. పాక్ లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. సర్గోధా, ఫైసలాబాద్ లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు రక్షణ వర్గాలు సూచించాయి. ఎనిమిది క్షిపణులతో పాకిస్థాన్ సైన్యం దాడులకు తెగబడింది. పాక్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను భారత్ సైన్యం నేల కూల్చింది. జమ్మూ యూనివర్సిటీ(University of Jammu) సమపంలో 2 పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. పాక్ వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. పాక్ పంజాబ్ లోని గగనతల హెచ్చరిక వ్యవస్థ అవాక్స్ ను భారత్ ధ్వంసం చేసింది.