09-05-2025 12:17:34 PM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams )లో భద్రత కట్టుదిట్టం చేశారు. భారత్-పాకిస్థాన్(India–Pakistan border) సరిహద్దుల్లో ఉద్రిక్తల దృష్ట్యా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు(Tirupati SP Harshavardhan Raju) శుక్రవరాం సమావేశమయ్యారు. తిరుమల సీవీఎస్ వో కార్యాలయంలో(Tirumala CVSO Office) భేటీ జరిగింది. మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించనున్నారని ఎస్పీ హర్షవర్ధన్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖ దేవాలయాలు వద్ద భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని సూచించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, సరిహద్దు రాష్ట్రాల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.