09-05-2025 12:22:09 AM
అనుమతి లేకుండా వందల టిప్పుల మొరం తరలింపు
ఇంత జరుగుతున్నా.. అధికారులకు కనిపించడం లేదంట..!
ఇక్కడి అధికారులకు ‘మామూలే’అంటున్న ప్రజలు
మంచిర్యాల, మే 8 (విజయకాంతి): మంచిర్యాల - చందాపూర్ వెళ్లే జాతీయ రహదారిని ఆనుకొని మందమరి మండలం అందుగుల పేట సమీపాన పెద్ద మొత్తంలో మట్టి, మొరం దందా కొనసాగుతుంది. విం తేంటంటే.. ఈ దారి వెంటే ప్రతిరోజు రెవె న్యూ, పోలీసు యంతాంగం ప్రయాణాలు సాగిస్తుంటారు.
కానీ వారికి ఈ దందా కనిపించడం లేదు. జాతీయ రహదారి వెంట పెద్ద మొత్తంలో టిప్పర్ల ద్వారా మట్టి రవా ణా చేయడం.., అది కూడా పగటి పూట తరలించడం చేస్తుంటే ఇది మందమర్రిలోని అధికారులకు ‘మామూలు’ ప్రకియ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతి లేకుండా తరలింపు..
జాతీయ రహదారిని ఆనుకొని పెద్ద మొత్తంలో టిప్పర్ల ద్వారా మొరం, మట్టిని తరలిస్తున్నారు. తరలించే మట్టికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదు. కానీ ఎన్ హెచ్‌ఏఐ అధికారులే మాకు మట్టిని పంపిస్తున్నారు. ఇందు కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ,
ఏ స్థా యిలో ఏం చేయాలో అది జరిగిపోయింది, ఇక్కడకు ఏ అధికారి రారు, వచ్చేదుంటే జాతీయ రహదారిని ఆనుకొని నిత్యం వంద ల టిప్పుల మొరం పోస్తూ లెవల్ చేస్తుంటే ఇక్కడికి రారా.. అంటూ చెబుతున్నారంటే ఏ స్థాయిలో తతంగం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అధికారులకు కనిపించడం లేదంట..!
వందల టిప్పుల మొరం వే బిల్లులు లేకుండా తరలిస్తున్నా సంబంధిత శాఖ అధికారులకు సోయి రావడం లేదు. ప్రభుత్వా నికి ఎలాంటి రాయల్టీలు కట్టకుండా, అనుమతులేమి తీసుకోకుండా పట్టపగలే దందా కొనసాగిస్తున్నా.. అటు రెవెన్యూ అధికారు లు కాని, ఇటు మైనింగ్ అధికారులు చడలేకపోతున్నారంటే..
ఏ మేరకు మేనేజ్ చేసు కున్నారో అర్థమవుతుంది. జేబులోకి పది రూపాయలొస్తే.., ప్రభుత్వానికి వంద రూపాయలు నష్టమైనా పర్వాలేదనుకునే అధికారు లున్నంత వరకు ఈ అకమ దందా కొనసాగుతూనే ఉంటదనడంలో ఎలాంటి సందే హం లేదని స్థానిక ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై మందమర్రి మండల తహసీల్దార్ సతీష్ కుమార్‌ను వివరణ కోర గా.. మట్టి తరలించకునేందుకు మండలంలో ఎవరికి అనుమతులు లేవని, ఎవరైనా ఫిర్యా దు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.