09-05-2025 12:19:28 AM
ఎయిర్‌పోర్డ్‌లో ప్రచార గ్లోబ్ ఏర్పాటు
రాజేంద్రనగర్, మే 8: హైదరాబాద్ నగరంలో అందాల పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఓ ఆకర్షణీయమైన ప్రచార గ్లోబ్ ను అధికారులు ఏర్పాటు చేశారు.
విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులందరికి ఇది కనిపించేవిధంగా అరైవల్స్ టెర్మినల్ వద్ద ఉంచినట్లు ఆర్ జి ఐఏ అధికారులు తెలియజేశారు. మిస్ వరల్ వంటి అంతర్జాతీయ కార్యక్రమం తెలంగాణను ప్రపంచంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆకాంక్షించారు. తెలంగాణ జరుర్ ఆనా తీమ్ తో సంస్కృతిక శాఖ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల నుంచి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఇంకా చాలామంది వస్తున్నారు.