09-05-2025 10:59:09 AM
న్యూఢిల్లీ: భారత్ తో పెట్టుకున్న పాకిస్థాన్(India-Pakistan War)కు మరో భారీ షాక్ తగిలింది. పాక్ ఆర్మీకి సహకరించొద్దని ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) నేతలు తేల్చిచెప్పారు. పాక్ ఆర్మీ ఆటలో మనం పావులు కావొద్దంటూ పస్తూన్ తెగల వారికి తాలిబన్ సూచించింది. పాకిస్థాన్ ఆర్మీ చేసేది జీహాద్ కాదు.. వాళ్లు దొంగలు అంటూ తాలిబాన్ నేతలు ప్రకటించారు. అటు భారత్ దెబ్బకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(Pakistan prime minister Shehbaz Sharif), ఆర్మీ చీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
భారత్ వ్యూహాన్ని పాక్ అంచనా వేయలేకపోయింది. దేశ ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి యుద్ధాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ దాడులకు గుణపాఠం చెబుతామని సూచించాయి. పాక్ సైనికులపై దాడులకు బాధ్యత తమదేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Balochistan Liberation Army) ప్రకటించింది. బలూచ్ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగానే దాడులు చేసినట్లు వెల్లడించింది. పాక్‌పై ఆరు దాడులు చేశాం, రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించామని బలూచిస్తాన్ వివరించింది. పాక్ సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేశాం, మొబైల్ టవర్లు ధ్వంసం చేశాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది.