calender_icon.png 20 January, 2026 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాశంలో ఒక తార.. సాత్విక!

20-01-2026 01:34:51 AM

వైవిధ్యమైన బహు భాషా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన నటిస్తున్న తాజాచిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నారు. గీతాఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రంతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. దీంతో సోమవారం మేకర్స్ కథానాయకి క్యారెక్టర్ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్ చూస్తే.. సరైన రోడ్లు కూడా లేని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన ఓ అమ్మాయి ఆకాశంలో తారలను చేరుకోవాలంటూ కనే కలలే ఈ సినిమా కథ అని అర్థమవుతోంది. ఇందులో సాత్విక అందంతో ఆకట్టుకుంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మేకర్స్ ఇదే ఏడాది వేసవిలో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్; సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్; ప్రొడక్షన్ డిజైన్: శ్వేతా సాబు సిరిల్; రచన: గంగరాజు గున్నం; నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం; దర్శకత్వం:  పవన్ సాధినేని.